గ్రామ సచివాలయంలోనే మందేసిన పంచాయతీ సెక్రటరీ 

గ్రామ సచివాలయంలోనే మందేసిన పంచాయతీ సెక్రటరీ 


అనంతపురం జిల్లాలోని బేలుగుప్ప మండలంలోని అంకంపల్లి గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు తన కార్యాలయంలో మద్యం సేవించిన నిర్వాకము ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు అతని మీద చ్యరలుకు ఉపక్రమించారు. మద్యం సేవించిన సదరు కార్యదర్శికి ఎంపీడీఓ ముస్తఫా షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇక ఇదే విషయం మీద ఈరోజు అధికారులు గ్రామానికి చేరుకొని విచారణ జరిపి తగు కలెక్టర్ కు నివేదిక పంపారు. ఈ ఘటనకు సంబందించిన వివరాల్లోకి వెళ్తే బెలుగుప్ప మండలంలోని అంకంపల్లి గ్రామ సచివాలయానికి వెంకటేశ్వర్లు కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కార్యదర్శి కళ్యాణదుర్గం పట్టణంలో నివాసముంటూ అంకంపల్లి గ్రామ సచివాలయంలో నిర్వహిస్తున్నారు.  

అయితే గత సోమవారం వెంకటేశ్వర్లు పనులు ముగించుకొని రాత్రి సచివాలయంలోని బసచేశారు. అప్పుడు మద్యం సేవించడం జరిగింది. అయితే ఈ వెంకటేశ్వర్లు గత 15 రోజులుగా విధి నిర్వహణలో భాగంగా కూడా మద్యం సేవించి వస్తుంన్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారం రాత్రి సచివాలయంలో సేవిస్తుండగా గ్రామస్తులు వీడియో చిత్రీకరించి సంబంధిత ఎంపీడీవోకు వీడియోను పంపారు. దీంతో ఎంపీడీవో కార్యదర్శికి షోకాజ్ నోటీసు పంపారు. జిల్లా కలెక్టర్ ఈ విషయం మీద నివేదిక కోరడంతో సంబందింత అధికారులు గ్రామానికి చేరుకొని విచారణ పట్టారు. మూడు రోజుల తర్వాత మద్యం సేవించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతున్నారు. దీని పై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.