రేపు ఏపీలో పంచాయతీ కార్యదర్శి పోస్టుల స్క్రీనింగ్ టెస్ట్

రేపు ఏపీలో పంచాయతీ కార్యదర్శి పోస్టుల స్క్రీనింగ్ టెస్ట్

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆదివారం పంచాయతీ కార్యదర్శి పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకే మౌర్య ఒక ప్రకటనలో తెలిపారు. 13 జిల్లాల్లోని 1320 పరీక్షా కేంద్రాల్లో 4,95,526 మంది అభ్యర్ధులు స్క్రీనింగ్ టెస్ట్ కు హజరుకానున్నారని పేర్కొన్నారు. ఉదయం 9గంటల నుంచి అర్ధగంట పాటు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. హల్ టికెట్ తో పాటు అభ్యర్ధి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఒరిజినల్ కార్డును తీసుకుని రావాలని సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు, క్యాలిక్యూలేటర్లను పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని ఆయన స్పష్టం చేశారు.