పాండ్య, రాహుల్‌కు షాక్.. భారీ జరిమానా విధింపు..

పాండ్య, రాహుల్‌కు షాక్.. భారీ జరిమానా విధింపు..

క్రికెటర్లు హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది... ‘కాఫీ విత్‌ కరణ్‌ ’షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఈ ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు రూ.20 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌. జరిమానాగా విధించిన ఆ మొత్తాన్ని ఎలా ఖర్చు చేయాలో కూడా సూచించారు. రూ. 20 లక్షల్లో రూ.10 లక్షలు.. అమరులైన పారామిలిటరీ దళ కానిస్టేబుళ్ల భార్యలకు రూ. లక్ష చొప్పున 10 మందికి చెల్లించాలని... మిగతా మొత్తం అంధుల క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రచార ఖర్చులకు విరాళంగా ఇవ్వాలని సూచించారు అంబుడ్స్‌మన్‌. ఇక ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా చెల్లించాలని.. లేనిపక్షంలో మ్యాచ్‌ ఫీజుల నుంచి కట్‌ చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.. రోల్‌ మోడల్స్‌గా ఉండాల్సిన ఇద్దరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని.. ఇద్దరూ క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు.