భారత్-ఆసీస్ : ముగిసిన రెండో సెషన్...

భారత్-ఆసీస్ : ముగిసిన రెండో సెషన్...

భారత్-ఆసీస్ మధ్య నేడు చివరి టెస్ట్ లోని చివరి రోజు ఆట జరుగుతుంది. అయితే నిన్న  ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 4 పరుగులు చేసిన భారత్ ప్రస్తుతం 183/3 తో నిలిచింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ తమ సొంతం చేసుకోవాలంటే భారత్ చివరి సెషన్ లో ఇంకా 145 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇక ఈరోజు ముగియడానికి ఇంకా ఉన్న 37 ఓవర్ల ఆట మిగిలి ఉంది. మళ్ళీ వర్షం రాకుండా రోజు ఆట పూర్తిగా సాగితే భారత్ కు విజయం సాధించేందుకు అవకాశాలు భారీగానే  ఉంటాయి. అయితే ప్రస్తుతం పుజారా(43), పంత్(10) తో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.