క్రికెట్ వరల్డ్‌ కప్‌: రాయుడు, పంత్‌కు ఊరట..!

క్రికెట్ వరల్డ్‌ కప్‌: రాయుడు, పంత్‌కు ఊరట..!

ఇంగ్లండ్ వేదికగా త్వరలోనే ప్రారంభం కానున్న క్రికెట్ వరల్డ్ కప్‌కు సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన 15 మందిలో చోటు దక్కించుకోలేకపోయిన అంబటి రాయుడు, రిషబ్ పంత్‌కు కాస్త ఊరట కలిగించే న్యూస్ వినిపించింది బీసీసీఐ. ఇప్పటికే వరల్డ్‌ కప్‌ కోసం ఎంపికైన 15 మందిలో ఎవరైనా గాయపడితే వారి స్థానంలో వీరు ఇంగ్లండ్‌ వెళ్లే అవకాశం కల్పించింది. మరోవైపు ప్రస్తుతం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడుతున్న పేసర్‌ నవ్‌దీప్‌ సైనీని కూడా స్టాండ్‌బై జాబితాలో చేర్చింది బీసీసీఐ. ఇక రాయుడు, పంత్ ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేయకపోవడంతో సెలక్టర్లపై విమర్శలు పెరిగాయి... క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్, గౌతమ్‌ గంభీర్‌ సహా కొందరు మాజీ క్రికెటర్లు ఈ యువ క్రికెటర్లకు మద్దతుగా లినిచారు. దీంతో బీసీసీఐ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు... ప్రస్తుతం స్టాండ్‌బై ఎంపిక చేసిన వారినే కాకుండా అవసరమైతే ఎవరినైనా అక్కడికి పంపించె అవకశం కూడా ఉంది. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ తరహాలోనే ఇప్పుడు టీమిండియాకు ముగ్గురు స్టాండ్‌బై ఆటగాళ్లు ఉన్నారు. పంత్‌, రాయుడు బ్యాట్స్‌మన్‌ కాగా సైనీ బౌలర్ల జాబితాలో ఉన్నారు.