చలికాలం: బొప్పాయితో.. మెరుపులాంటి అందం

చలికాలం: బొప్పాయితో.. మెరుపులాంటి అందం

చాలామందికి చలికాలం వస్తుందంటే పొడి చర్మంతో రకరకాల సమస్యలు వచ్చేస్తుంటాయి. చలికాలంలో ఎదురయ్యే సమస్యల నుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కోల్డ్ క్రీమ్స్, బాడీ బట్టర్స్, మాయిశ్చరైజర్స్ వంటివి వాడడానికి తిప్పలు పడుతుంటారు. ఈ బాధను తప్పించుకోవడానికి బొప్పాయితో కొన్ని చిట్కాలు ఉన్నాయి. బాగా పండిన బొప్పాయి, బాగా పండిన అరటిపండు, 2 టేబుల్ స్పూన్ల తేనె తీసుకోవాలి. ఈమూడు పదార్థాలను మిక్స్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి. మెత్తగా పేస్ట్ లా చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. డ్రై అయిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, అరటిలో ఉండే విటమిన్స్ యాంటీఏజెంట్స్ గా పనిచేస్తాయి. తేనె డ్రై స్కిన్ కు నేచురల్ గా మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఈ ప్యాక్ వల్ల చలి కాలం సీజన్ లో చర్మం కాంతివంతంగా..యంగ్ గా కనబడుతారు.