మరోసారి ముద్దుపెడితే... కోసేస్తుందట... 

మరోసారి ముద్దుపెడితే... కోసేస్తుందట... 

బిగ్ బాస్ షో దేశంలో ఎంతగా విజయం సాధించిందో చెప్పక్కర్లేదు.  బిగ్ బాస్ షో బాలీవుడ్ లో గత 13 సీజన్లుగా నడుస్తున్నది.  అయితే, ఈ 13 వ సీజన్ మరింత కాంట్రవర్షియల్ గా మారింది.  ఈ సీజన్లో అనేక ఇబ్బందులు సంఘటనలు జరుగుతున్నాయి.  బయట కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండే వ్యక్తులు హౌస్ లోకి రాగానే కలిసిపోయి గేమ్ ను రన్ చేస్తున్నారు.  ప్రేమికులుగా యాక్ట్ చేస్తున్నారు.  

అయితే, ఈ షోలో ఇప్పుడు కంటెస్టెంట్ పరాగ్ అనే వ్యక్తి ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి.  హౌస్ లో మహీరా అనే కంటెస్టెంట్ కు ముద్దు పెట్టేందుకు చాలాసార్లు ప్రయత్నం చేశారు.  అలా ప్రయత్నం చేసిన ప్రతిసారి వార్నింగ్ ఇచ్చింది.  రీసెంట్ గా ఈ స్టార్ ఏకంగా ఆమెకు ముద్దు పెట్టేశాడు.  దీంతో మహీరా చాలా సీరియస్ అయ్యింది.  ఇంకోసారి ముద్దుపెడితే పెదాలు కోసేస్తా అని వార్నింగ్ ఇచ్చింది.  సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడంతో పరాగ్ అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు.