ఈసారి దేవుడిపై దృష్టి పెట్టిన పరశురామ్ !

ఈసారి దేవుడిపై దృష్టి పెట్టిన పరశురామ్ !

'యువత' చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి 'సోలో, శ్రీరస్తు శుభమస్తు' లాంటి ప్రేమ కథా చిత్రాలతో హిట్లందుకుని ఇటీవలే 'గీత గోవిందం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు పరశురామ్ తన తర్వాతి సినిమా కూడ కొంచెం భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 

తాజా సమాచారం మేరకు ఆయన నిర్మాత బన్నీ వాస్ కి ఒక స్టోరీ లైన్ చెప్పారని, అది దేవుడికి, మానవుడికి మధ్యన ఉన్న సంబంధాన్ని ఎలివేట్ చేసేలా ఉంటుందని తెలుస్తోంది.  మరి ఈ వార్త నిజమో కాదో, ఒకవేళ నిజమే అయితే సినిమా ఎప్పుడు, ఏ హీరోతో ఉంటుందో వంటి వివరాలను పరశురామే స్వయంగా రివీల్ చేయాల్సి ఉంది.