అల్లు అర్జున్ సినిమాపై పరశురామ్ నో కామెంట్..!!

అల్లు అర్జున్ సినిమాపై పరశురామ్ నో కామెంట్..!!

పరుశురాం దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం సినిమా సూపర్ హిట్టయింది.  అంతేకాదు, వసూళ్ల పరంగా ఈ సినిమా వందకోట్ల క్లబ్ లో చేరింది.  అటు యూఎస్ లోరెండు మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డు దిశగా దూసుకెళ్తుంది.  ఈ సినిమా విజయంపై పరశురామ్ మీడియాతో ముచ్చటించారు.  

"2008 నా సినిమా ప్రస్థానం మొదలైంది.  ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశాను.  గీత గోవిందం నా ఆరో సినిమా.  ఈ సినిమా విజయవంతం కావడంతో బాధ్యత పెరిగింది.  గీత గోవిందం విజయంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందనలు ప్రముఖ పాత్ర పోషించారు.  వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు ప్లస్ అయింది.  బన్నీ వాసు నాకు మంచి మిత్రుడు.  కథ చెప్పగానే ఓకే చెప్పేశారు.  గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ సినిమాకు సమర్పకుడుగా వ్యవహరించారు.  గీతా ఆర్ట్స్ లో గతంలో శ్రీరస్తు శుభమస్తు సినిమా చేశాను.  అది కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం మర్చిపోలేనిది.  ప్రస్తుతం బన్నీ వాసుకు ఓ కథ చెప్పాను.  ఈ ఏడాదిలోనే మరో సినిమా ప్రారంభమౌతుంది.  అల్లు అర్జున్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాను.  ఆ వివరాలను గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి అధికారికంగా ప్రకటిస్తేనే బాగుంటుంది" అన్నారు.