రష్మికతో మళ్ళీ ఆ దర్శకుడు మ్యాజిక్ చేస్తాడట...!!

రష్మికతో మళ్ళీ ఆ దర్శకుడు మ్యాజిక్ చేస్తాడట...!!

రష్మిక మందన వరస విజయాలతో దూసుకుపోతున్నది.  ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు సినిమాల విజయంతో టాప్ పొజిషన్లో ఉండటం విశేషం.  ఇప్పుడు బన్నీతో సినిమా చేస్తున్నది.  ఈ సినిమాతో పాటుగా ఈ అమ్మడు మరికొన్ని సినిమాలు కూడా చేసేందుకు సిద్ధం అయ్యింది.  అందులో ఒకటి నాగ చైతన్య సినిమా.  

గీత గోవిందం దర్శకుడు పరశురామ్ ఓ సూపర్ లవ్ స్టోరీతో నాగచైతన్య హీరోగా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.  ఇందులో కూడా రష్మికను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నాడట.  గీతగోవిందం సినిమాలో రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు.  ఆ సినిమాలో రష్మిక మ్యాజిక్ పనిచేసింది.  అదే విధంగా ఇప్పుడు చేయబోయే సినిమాలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని అంటున్నారు.  మరి చూద్దాం ఏమౌతుందో.