'దగ్గుబాటి'కి పోటీగా వెంకటేశ్వరరావు..!

'దగ్గుబాటి'కి పోటీగా వెంకటేశ్వరరావు..!

ఒకే పేరుతో ఇద్దరుంటే ఎంత కన్ఫ్యూజనో మనందరికీ అనుభవమే. మరి ఒకే పేరుతో ఇద్దరు నేతలుండి.. ఇద్దరూ ఒకే చోట నుంచి పోటీ చేస్తే..? వీరు పోటీ చేసే పార్టీల గుర్తులు కూడా ఇంచుమించు ఒకేలా ఉంటే..? కచ్చితంగా ఫలితంపై ప్రభావం ఉంటుంది. అటువంటి పరిస్థితే మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఎదురవుతోంది. సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికల బరిలోకి దిగుతున్న ఈ రాజకీయ దిగ్గజం.. ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి బరిలోకి దిగుతున్న ఆయన విజయమే లక్ష్యంగా ప్రజల్లో మమేకమవుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

ఐతే.. నియోజకవర్గంలో దాదాపు ఇదే పేరుతో మరో నేత బరిలో ఉండడం ఆయన అనుచరులను కలవరపెతుతోంది. వైసీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేస్తుండగా..ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర్లు నామినేషన్‌ వేశారు. పేర్లు దగ్గరగా ఉండడం, పార్టీ ఎన్నికల గుర్తులు కూడా ఒకేలా ఉండడంతో తమ ఓట్లు ఎక్కడ చీలుతాయోనని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.