శ్రద్దా కపూర్ స్థానంలో పరిణీతి చోప్ర !

శ్రద్దా కపూర్ స్థానంలో పరిణీతి చోప్ర !

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా హిందీలో ఒక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రంలో ముందుగా సైనా పాత్రకు శ్రద్దా కపూర్ అనుకున్నారు.  శ్రద్దా బ్యాడ్మింటన్ శిక్షణ కూడా తీసుకుంది.  కానీ షూటింగ్ మొదలుపెట్టగానే ఆమె డెంగ్యూ బారినపడింది.  దీంతో షూట్ కాస్త ఆగిపోయింది.  

ఇటీవలే కోలుకున్న ఆమె 'స్ట్రీట్ డాన్స్ త్రీడీ' సినిమా షూటింగ్లో బిజీగా ఉంది.  అలాగే 'సాహో' పనులు కూడా చూసుకుంటోంది.  దీంతో సైనా సినిమాకు ఆమె డేట్స్ కుదరడంలేదు.  ఇక చేసేది లేక నిర్మాతలు ఆమె స్థానంలో పరిణీతి చోప్రాను తీసుకున్నారు.  త్వరలోనే పరిణీతి బ్యాడ్మింటన్ శిక్షణ ఆరంబించనుంది.  అమోల్ గుప్తే డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను 2020కి విడుదల చేయనున్నారు.