నికి షూ దాచేస్తుందట..!!

నికి షూ దాచేస్తుందట..!!

ఇటీవలే ప్రియాంక.. నీకీ జోనస్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరిగింది.  ఈ కార్యక్రమానికి ప్రియాంక తన క్లోస్డ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే హాజరయ్యారు. ప్రియాంక సోదరి పరిణితి చోప్రా ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సోదరి ఎంగేజ్మెంట్ పనులను దగ్గరుండి పర్యవేక్షించింది.  వివాహం అక్టోబర్ లో జరుగుతుందని సమాచారం.  

నార్త్ ఇండియాలో జరిగే వివాహ వేడుకల్లో ఓ విచిత్రమైన తంతు ఉంటుంది.  వివాహానికి ముందు పెళ్ళికొడుకు బూట్లు పెళ్లికూతురు తరుపువారు దాచేస్తారు.  పెళ్లి కొడుకును డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసి.. డబ్బులు ఇచ్చాకే బూట్లు ఇస్తారు.  ఈ సంప్రదాయాన్ని ప్రియాంక పెళ్ళిలో కూడా కొనసాగిస్తారా అని పరిణితి చోప్రాను అడిగితే.. తప్పకుండా అని సమాధానం ఇచ్చింది. పెళ్లి వేడుకలో జరిగే ఆ తంతు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు పరిణితి చోప్రా చెప్తున్నది.  ప్రియాంకా చోప్రా నికి జోనస్ ను ఎంతగా ప్రేమించిందో చెప్తూ ఓ సందేశాన్ని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది పరిణితి.