నగర బహిష్కరణపై స్వామీజీ 3 వ్యాజ్యాలు

 నగర బహిష్కరణపై స్వామీజీ 3 వ్యాజ్యాలు

హైదరాబాద్ నగరం నుంచి తనను బహిష్కరిస్తూ పోలీసులిచ్చిన ఉత్తర్వులపై స్వామి పరిపూర్ణానంద హైకోర్టులో మూడు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశారు. 10న హైదరాబాద్ కమీషనరేట్, 14న రాచకొండ కమీషనరేట్, 15న సైబరాబాద్ కమీషనరేట్లు స్వామీజీని నగరం నుంచి బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఎలాంటి కారణాలు చూపకుండా ఈనెల 11న తనను ఇంట్లో నిర్భందించారని, అనంతరం కాకినాడ పీఠానికి తీసుకెళ్లి వదిలేశారని తెలిపారు. చట్ట వ్యతిరేకంగా, రాజ్యంగ వ్యతిరేకంగా ఉన్న బహిష్కరణ ఉత్తర్వులను రద్దు చేయాలంటు కోర్టును అభ్యర్థించారు.