పెట్రోధరలపై భగ్గుమన్న ఫ్రాన్స్ ప్రజలు

పెట్రోధరలపై భగ్గుమన్న ఫ్రాన్స్ ప్రజలు

పెట్రోధరల పెరుగుదలపై ఫ్రాన్స్ ప్రజలు రోడ్డెక్కారు. పన్నులు తగ్గించాలంటూ  వారం రోజులుగా దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. వ్యాపార వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ పదవికి రాజీనామా చేయాలని ఆందోళనలు చేపట్టారు. పారిస్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఒక దశలో భాష్పవాయువును ప్రయోగించారు పోలీసులు.  ఎల్లో వెస్ట్‌ పేరుతో  జరుగుతున్న ఆందోళనలో రాజకీయపార్టీలతో సహా వాహనాల డ్రైవర్లు, వ్యాపార సంఘాలు పాల్గొంటున్నాయి. ఒక్క పారిస్‌లో జరిగిన ఆందోళనల్లోనే దాదాపు 30వేల మందికిపైగా పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆందోళనలో భాగంగా  ఒక వ్యక్తి గ్రెనేడ్‌ పట్టుకొని అధ్యక్షభవనంలోకి చొరబడేందుకు  ప్రయత్నించాడు. దాంతో దేశ అధ్యక్ష భవనం వద్ద భద్రత కట్టుదిట్టం చేసింది. ఆందోళనలు చేయడాన్ని నివారిస్తూ ప్రభుత్వం నిషేధం విధించింది.