తుది విడత పరిషత్‌ పోలింగ్‌ ప్రారంభం

తుది విడత పరిషత్‌ పోలింగ్‌ ప్రారంభం

జిల్లా పరిషత్‌, మండల పరిషత్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో ఇవాళ మూడో విడుదత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 వరకు కొనసాగనుంది  తీవ్రవాద ప్రభావ ప్రాంతాలుగా గుర్తించిన కొమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని 21 మండలాల పరిధుల్లో గల 205 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగిసిపోతుంది. బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎంపీటీసీకి వైట్‌ కలర్‌, జడ్పీటీసీకి పింక్‌ కలర్‌ పేపర్లను వినియోగిస్తున్నారు. ఈ దశలో 161 జడ్పీటీసీ, 1738 ఎంపీటీసీ స్థానాలకు 9,494 పోలింగ్‌ స్టేషన్లలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.