నేటితో పరిషత్ ప్రచారం సమాప్తం

నేటితో పరిషత్ ప్రచారం సమాప్తం

తెలంగాణలో పరిషత్ ఎన్నికల రెండు దశలు ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం మూడో దశ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మొత్తం 161 జెడ్పీటీసీ, 1,738 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం జరుపుకునేందుకు వీలుంది. ఐతే, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల కల్లా ప్రచారాన్ని ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. తొలివిడతలో మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో ఎన్నికలు జరిగితే... రెండో విడతలో కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తైంది. మిగతా 27 జిల్లాల్లో మూడో విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. వీటి ఫలితాలు ఈ నెల 27న విడుదలకానున్నాయి.