నేటి నుంచి పార్ల‌మెంటు స‌మావేశాలు

నేటి నుంచి పార్ల‌మెంటు స‌మావేశాలు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో కాంగ్రెస్ ఫుల్ జోష్‌తో ఈ స‌మావేశాల‌కు హాజరుకానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు పార్ల‌మెంటులో అధికార ప‌క్షానికి పెద్ద‌గా అవ‌రోధాల్లేవ్‌.  కాని మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ స‌మావేశాలు వాడివేడిగా సాగే అవ‌కాశ‌ముంది. ఈ సమావేశాల్లోనూ సీబీఐ, ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ రాజీనామా వ్య‌వ‌హారంతో పాటు రాఫెల్ డీల్‌పై అధికార ప‌క్షాన్ని కాంగ్రెస్ నిల‌దీయ‌నుంది. మ‌రోవైపు అగ‌స్టావెస్ట్‌ల్యాండ్ కేసు ద‌ర్యాప్తు అధికార ప‌క్షానికి ఏమాత్రం ప‌నికి వ‌స్తుందో చూడాలి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం మోడీని డిఫెన్స్‌లో ప‌డేసే అవ‌కాశముంది. దాదాపు నెల రోజులు పాటు సాగే ఈ స‌మావేశాలు వైరి ప‌క్షాల‌కు కీల‌కంగా మార‌నుంది. ఎందుకంటే వ‌చ్చే పార్ల‌మెంటు స‌మావేశాలు బ‌డ్జెట్ స‌మావేశాలే. ఓట్ ఆన్ అకౌంట్‌కు మాత్ర‌మే ప‌రిమితం కానుంది. కాబ‌ట్టి ఈ స‌మావేశాల‌ను పూర్తిగా వినియోగించుకునేందుకు విప‌క్షాలు సిద్ధ‌మౌతున్న నేప‌త్యంలో రైతు స‌మస్య‌ల‌ను కూడా విప‌క్షాలు ప్ర‌ధానంగా ప్ర‌స్తావ‌న‌కు తెచ్చే అవ‌కాశ‌ముంది.