'ఆర్టీసీపై వారి కన్ను పడింది'

'ఆర్టీసీపై వారి కన్ను పడింది'

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ మనుగడే  ప్రశ్నార్థకంగా మారిందని వైసీపీ నేత పార్థసారథి అన్నారు. ఇవాళ ఆయన విజయవాడలో మాట్టాడుతూ 'ఆర్టీసీపై చంద్రబాబుకు, ఆయన అనుచరులకు కన్నుపడింది. కబ్జా చేసే కుట్రలో భాగంగా నష్టాలను పెంచుతున్నారు. ఆర్టీసీని బంగారు బాతులా భావించి చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు' అని అన్నారు. పోలవరం, ధర్మపోరాట దీక్షలకు ఆర్టీసీని అడ్డంగా వాడేశారన్న పార్థసారథి.. దొంగ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ వల్ల ఆర్టీసీ‌ నష్టల బాటలో నడుస్తోందన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ఆదుకుంటామని స్పష్టం చేశారు.