ఫిరాయింపుదారులకు భంగపాటు..!

ఫిరాయింపుదారులకు భంగపాటు..!

ఫార్టీ ఫిరాయించిన వారికి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో భంగపాటు తప్పలేదు... గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ మారడం.. ఇక ఎన్నికలకు ముందు గోడదూకిన నేతలు ఓటమిబాటలో ఉన్నారు. పాతపట్నం నుంచి కలమట వెంకట రమణ వెనుకబడగా... పార్టీ మారి తొలిసారి ఓటమిపాలయ్యారు సుజయ కృష్ణరంగారావు. మరోవైపు గిడ్డి ఈశ్వరీ కూడా పాడేరులో వెనుకంజలో ఉన్నారు. జగ్గంపేట నుంచి బరిలోకి దిగి జ్యోతులకు కూడా పరాజయం తప్పేలా లేదు. రంపచోడవరం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా  ఎన్నికై పార్టీ మారిన వంతల రాజేశ్వరీ కూడా ఓటమి బాటలోనే ప్రయాణం చేస్తున్నారు. పామర్రు అభ్యర్ధి ఉప్పులేటి కల్పనకు ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. గూడురు అభ్యర్ధి సునీల్, శ్రీశైలం అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మంత్రులు అమర్‌నాథ్‌రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, అఖిల ప్రియ కూడా ఓటమి అంచుల్లో ఉండగా... ఇక తన కుమార్తెకు టిక్కెట్ దక్కించుకున్నా.. విజయాన్ని మాత్రం అందించలేకపోయారు జలీల్ ఖాన్.