శంషాబాద్ లో పట్టుబడ్డ బంగారం..’అక్కడ’ దాచాడు !

శంషాబాద్ లో పట్టుబడ్డ బంగారం..’అక్కడ’ దాచాడు !

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు చేసి దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తి వద్ద 300 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న రేయ్. ‌కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు కేటుగాళ్లు. ఈ క్రమంలోనే బంగారాన్ని కరిగించి గోలీలు గా మార్చి మలద్వారం లో దాచుకొని ఓ వ్యక్తి తీసుకువచ్చాడు. నడక చూసి అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు తమదైన స్టైల్ విచారణ చేయగా ఈ బంగారం స్మగ్లింగ్ గుట్టు బయటపడింది. ఇక చేసేదేమీ లేక మలద్వారంలో దాచిన బంగారాన్ని అధికారులకు అప్పజెప్పాడు స్మగ్లర్. స్వాధీనం చేసుకున్న బంగారం 14 లక్షల విలువ ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.