13 ఏళ్ల తర్వాత ఆసీస్ బౌలర్ నంబర్‌ వన్‌

13 ఏళ్ల తర్వాత ఆసీస్ బౌలర్ నంబర్‌ వన్‌

దాదాపు 13 ఏళ్ల తర్వాత ఓ ఆసీస్‌ బౌలర్‌.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరకున్నాడు. సఫారీ పేసర్ రబాడను వెనక్కి నెట్టి 878 పాయింట్లతో ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ టాప్‌ ప్లేస్‌ను చేజిక్కించుకున్నాడు. చివరిసారి 2006లో ఆస్ట్రేలియా నుంచి గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ ఈ ఘనత సాధించాడు. ఇక.. బ్యాటింగ్‌లో..  కోహ్లీ (922) టాప్‌ ర్యాంక్‌లో, పుజారా (881) మూడో స్థానంలో కొనసాగుతున్నారు. కేన్‌ విలియమ్సన్‌ (897) రెండో స్థానంలో నిలిచాడు.