నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. పుజారా ఔట్

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. పుజారా ఔట్

గబ్బా వేదికగా భారత్-ఆసీస్ మధ్య ప్రస్తుతం చివరి టెస్ట్ లో ఆఖరి రోజు ఆట జరుగుతుంది. అయితే భారత్ విజయానికి ఇంకా 100 పరుగులు అవసరం ఉన్న సమయంలో అర్ధశతకం చేసిన పుజారా(56) ఔట్ అయ్యాడు. దాంతో భారత్ 228 పరుగులకు నాలుగో వికెట్ కోల్పోయింది. దాంతో 34 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న పంత్ తో కలిసి ఆడేందుకు మయాంక్ అగర్వాల్ వచ్చాడు. అయితే ఈరోజు ఆట ముగియడానికి  ఇంకా 19 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. చూడాలి మరి ఈలోపు టీం ఇండియా తన లక్ష్యాన్ని ఛేదిస్తుందా.. లేదా అనేది.