పుజారా ఎప్పుడు మాకు తలనొప్పిగా ఉంటాడు : పాట్ కమ్మిన్స్
ప్రస్తుత ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ భారతదేశం యొక్క చేతేశ్వర్ పుజారా పొడవైన ఫార్మాట్లో బౌలింగ్ చేయటానికి కష్టతరమైన బ్యాట్స్మాన్ అని వెల్లడించాడు. గత ఏడాది ఆస్ట్రేలియాలో తమ తొలి టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించడానికి భారత్ కు చేతేశ్వర్ పుజారా సహాయం చేసాడు. ఎందుకంటే అతను ఆ సిరీస్‌లో 521 పరుగులు సాధించాడు 74 కి పైగా సగటుతో మూడు అర్ధ సెంచరీలతో నిలిచాడు. అయితే ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఎసిఎ) ఏర్పాటు చేసిన లైవ్ ప్రశ్న & సమాధానం సెషన్లో ఏ బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చేయడానికి కష్టమని కమ్మిన్స్ ను అడిగారు. అప్పుడు అతను... భారతదేశానికి చెందిన చేతేశ్వర్ పూజారా మాకు బౌలింగ్ చేయడానికి నిజమైన తలనొప్పిగా ఉండేవాడు అని పాట్ కమ్మిన్స్ చెప్పారు. గత ఏడాది భారత్-ఆసీస్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో పుజారాను అవుట్ చేయడం ఆస్ట్రేలియా జట్టుకు ఎంత కష్టమో కమ్మిన్స్ గుర్తు చేసుకున్నారు. కమ్మిన్స్ జట్టు సహచరులు నాథన్ లియోన్ మరియు జోష్ హాజిల్‌వుడ్ కూడా పూజారాకు ఈ సిరీస్‌లో తాము బౌలింగ్ చేసేటప్పుడు అనుభవించిన నిరాశ గురించి మాట్లాడారు. అయితే చేతేశ్వర్ పుజారాను ఈ సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)