ఐపీఎల్ కోసం నేను ఐసోలేషన్ కు సిద్ధం : కమ్మిన్స్ 

ఐపీఎల్ కోసం నేను ఐసోలేషన్ కు సిద్ధం : కమ్మిన్స్ 

ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమ్మిన్స్ తన ఐపీఎల్ యజమానులతో సన్నిహితంగా ఉన్నానని, ఈ ఏడాది ఐపీఎల్ ఆడటం కోసం ఇంకా ఆశాజనకంగా ఉన్నానని చెప్పాడు. ఐపీఎల్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డును సృష్టిస్తూ పాట్ కమ్మిన్స్‌ను డిసెంబర్ లో జరిగిన వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ .15.50 కోట్లకు కొనుగోలు చేసింది. నేను జట్టు యజమానులతో మరియు అక్కడి సిబ్బందితో మాట్లాడినప్పుడల్లా, ఈ సంవత్సరం ఏదో ఒక దశలో ఆడగలమని వారు ఇప్పటికీ నిజంగా నమ్మకంగా ఉన్నారు" అని కమ్మిన్స్ చెప్పారు. నేను చాలా స్పష్టమైన కారణాల వల్ల ఆడటానికి నిజంగా ఎదురు చూస్తున్నాను. అవసరమైతే ఐపీఎల్ కోసం నేను ఐసోలేషన్ కు సిద్ధంగా ఉన్నాను అని తెలిపాడు. అయితే లాక్ డౌన్ ప్రస్తుత దశ ముగిసిన తరువాత ఏం జరుగుతుంది అనేది చూడాలి మరి.