ఐపీఎల్ స్పాన్సర్ షిప్ రేసులో బాబా రామ్‌దేవ్ పతంజలి...

ఐపీఎల్ స్పాన్సర్ షిప్ రేసులో బాబా రామ్‌దేవ్ పతంజలి...

బాబా రామ్‌దేవ్ పతంజలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్పాన్సర్ షిప్ హక్కులకోసం ప్రయత్నిస్తుంది అని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ రోజు ఆ విషయాన్ని పతంజలి కంపెనీ అధికారి స్వయంగా తెలిపారు. పతంజలి ఆయుర్వేద్ రాబోయే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం బిడ్ చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పాడు. చైనా సంస్థ వివో  ఐపీఎల్ స్పాన్సర్ షిప్ హక్కుల నుండి తప్పుకుంటున్నట్లు చెప్పిన తరువాత ఐపీఎల్ 2020 యొక్క స్పాన్సర్ షిప్ యొక్క స్లాట్ ఖాళీ అయ్యింది. పతంజలి ఆయుర్వేద ఆధారిత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతులు చెప్పట్టాలని చూస్తుంది. కాబట్టి ఐపీఎల్ స్పాన్సర్ అయితే ఈ హరిద్వార్ సంస్థ గ్లోబల్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌లోకి ప్రవేశించడానికి అది చాల సహాయపడుతుంది అని పతంజలి ప్రతినిధి ప్రకటించారు. అయితే, ఈ అంశంపై కంపెనీ ఇంకా తుది పిలుపునివ్వలేదని త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటాము అని చెప్పారు. హరిద్వార్‌కు చెందిన పతంజలి గ్రూపుకు సుమారు 10,500 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే  ఐపీఎల్ స్పాన్సర్ రేసులో ఈ భారత సంస్థ ముందజలో ఉంది.  ఇక సెప్టెంబర్ 19 నుండి యుఎఇలో ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం ఆటగాళ్లు అందరూ సన్నద్ధమవుతున్నారు.