బ్రాండెడ్ దుస్తులకు పోటీగా పతంజలి ప్రోడక్ట్స్

బ్రాండెడ్ దుస్తులకు పోటీగా పతంజలి ప్రోడక్ట్స్

అన్ని రకాల ఉత్పత్తుల్లో ప్రవేశించి వినియోగదారుడి మన్ననలు అందుకున్న పతంజలి ప్రోడక్ట్స్.. బ్రాండెడ్ దుస్తుల విభాగంలోనూ ప్రవేశిస్తామని ఇటీవలే ప్రకటించింది. అనుకున్నట్టే ఆన్ లైన్ లో అమ్ముతున్న ఆఫర్ ధరలతో పోటీగా నాణ్యమైన స్వదేశీ కాటన్ దుస్తుల్ని ప్రవేశపెట్టారు. మన దుస్తులే ధరించి స్వదేశీ గౌరవం చాటుకుందామంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. 1 జీన్ ప్యాంట్, 2 టీ షర్ట్స్ కలిపి రూ. 1100 కే అందిస్తున్నామని, వాస్తవానికి బయటి మార్కెట్లో వాటి ధర రూ. 7 వేలు ఉంటుందని రాందేవ్ ట్విట్టర్లో ప్రచారం చేస్తున్నారు.