ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లోకి పతంజలి.. ఆర్డర్‌మీ పేరుతో వెబ్‌పోర్టల్‌

 ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లోకి పతంజలి..  ఆర్డర్‌మీ పేరుతో వెబ్‌పోర్టల్‌

దేశీయ కంపెనీ కంపెనీ పతంజలి మరో ముందడుగు వెసింది...స్వదేశీ వస్తువులను సరఫరా చేయడానికి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఆర్డర్‌మీ’ ప్రారంభించటానికి సిద్దమవుతోంది...అందుకోసం త్వరలోనే ఇ-కామర్స్ ఆన్‌ లైన్‌ సైట్‌ అందుబాటులోకి తీసుకురానుంది..

దేశంలో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్ భారతదేశంలో తయారైన వస్తువులు సరఫరా చేయడానికి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించే పనిలో ఉన్నట్లు సన్నితహిత వర్గాలు ప్రముఖ పత్రికకు వెల్లడించాయి...ప్రధాని మోదీ స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు...పీఎం నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపు ఇచ్చిన 48 గంటల్లోనే పతంజలి గ్రూప్‌ ఈ నిర్ణయం తీసుకుంది...

ఆర్డర్‌మీ అనే పేరుతో ఇ-కామర్స్ సైట్‌ను పతంజలి ప్రారంభించనుందని ,సొంత దేశీయ ఆయుర్వేద ఉత్పత్తులను మాత్రమే పంపిణీ చేస్తుందన్నారు మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ... అలాగే వినియోగదారుని భారతీయ ఉత్పత్తులను విక్రయించే ఇతర వ్యాపార సంస్థలతో కూడా ఒప్పందం చేసకుంటుందని  పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు...

వచ్చే 15 రోజుల్లో ఆర్డర్‌మీ అనే పేరుతో ఇ-కామర్స్ సైట్‌ను ప్రారంభిస్తామని  మేనేజింగ్ డైరెక్టర్  బాలకృష్ణ తెలిపారు... ఈ ప్లాట్‌ఫాం కొన్ని గంటల్లోనే ఉచితంగా ఉత్పత్తులను ఇంటి వద్దనే అందజేస్తుంది...అదనంగా, ఈ సైట్ ద్వారా పతంజలికి సుమారు 1,500 మంది వైద్యులు 24 గంటలు ఉచిత వైద్య సలహాలను, అలాగే యోగా సూచనలు కూడా అందిస్తుందన్నారు...

పతంజలి ఆయుర్వేద్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆచార్య బాల్కృష్ణ మాట్లాడుతూ “ఆర్డర్మీ స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే సరఫరా చేస్తుందన్నారు...అంతే కాకుండా  దేశీయ వస్తువులను పంపిణీ చేసే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఇ) ఈ వేదిక ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు...