తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో దారుణం

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో దారుణం

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో దారుణం జరిగింది. జ్వరంతో జనరల్‌ వార్డులో చేరిన వ్యక్తిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించేందుకు స్ట్రెచర్‌ అందుబాటులో లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. సుమారు అరగంటపాటు బంధువులు వేచిచూశారు. అప్పటికీ రాకపోవడంతో వారి అవస్థను గమనించిన ఓ వ్యక్తి స్ట్రెచర్‌ను సంపాదించివారికి ఇచ్చారు. అత్యవసర విభాగానికి తరలిస్తుండగా ఆరోగ్యం మరింత విషమించడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రోగి బంధువుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో సరిపడా స్ట్రెచర్లు లేవని, వైద్య సిబ్బంది సైతం అందుబాటులో ఉండటంలేదని వైద్యులతో వాగ్వాదానికి దిగారు. మౌలికవసతుల లేమిపై దృష్టిసారించిన జిల్లా కలెక్టర్‌ భరత్‌ నారాయణ్‌ గుప్తా శనివారం ఉదయం రుయాలో తనిఖీలు చేసి వెళ్లిన కొద్దిసేపటికే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.