పట్టాభిషేక మహోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు

పట్టాభిషేక మహోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు

గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణా కరకట్ట రోడ్డులోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీవారి ఉత్తరాధికారి శిష్య సన్యాస దీక్షా స్వీకార, పట్టాభిషేక మహోత త్సవం ఈ నెల 15 నుంచి 17 వరకు జరుగనుంది. ఈ కార్యక్రమానికి సీఏం జగన్‌తోపాటు తెలంగాణ, ఒడిశా సీఏంలు కేసీఆర్‌, నవీన్‌ పట్నాయక్‌లు హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన దీక్షా స్థలిని, దీక్ష ప్రాంగణాన్ని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్‌ అయ్య న్నార్‌, ఐజీ, అర్బన్‌ ఎస్పీలు పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు అస్కారం లేకుండా కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.