ఇసుక లేక మేస్త్రీ ఆత్మహత్య....పవన్ ఆర్థికసాయం

ఇసుక లేక మేస్త్రీ ఆత్మహత్య....పవన్ ఆర్థికసాయం

ఏపీలో ఇసుక కొరత భవన నిర్మాణ కార్మికుల జీవితాలలో కష్టాలను నింపుతోంది. తాజాగా ఏపీలో ఓ మేస్త్రీ ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లాలో తాపీ మేస్త్రీ పని చేసి నాగ బ్రహ్మాజీ ఉరివేసుకొని ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటన పట్ల స్పందించారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, ఏపీలో ఇసుక కొరత ఇసుక కొరత లక్షలాదిమంది కార్మికుల పొట్ట కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్.

నాగ బ్రహ్మాజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ లక్ష రూపాయల ఆర్థికసాయం ప్రకటించారు. ఏపీ ప్రభుత్వ అస్తవ్యస్త ఇసుక విధానం కారణంగా రాష్ట్రంలోని 19.6 లక్షల మంది కార్మికులు నేరుగా ప్రభావితం కాగా, మరో 10 లక్షల మంది పరోక్షంగా ఉపాధి కోల్పోయారని పవన్ తెలిపారు. ఏపీలోని ఇసుక విధానం విషయంలో కలగచేసుకొని రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కాపాడాలని కేంద్రానిన్ని ఈ ట్వీట్ లో కోరారు పవన్. పనిలేని కార్మికుల కుటుంబాలు ఇప్పుడేం చేయాలో తెలియని స్థితిలో పడిపోయారని విమర్శించారు. నవంబర్ 3న భవన నిర్మాణ కార్మికుల కోసం విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు పవన్ కల్యాణ్.