కానిస్టేబుల్ కొడుకు ఎందుకు సీఎం కాలేడు?

కానిస్టేబుల్ కొడుకు ఎందుకు సీఎం కాలేడు?

కానిస్టేబుల్ కొడుకు ఎందుకు సీఎం కాలేడు? కచ్చితంగా అవుతాడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ధవళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, నా తండ్రి ఓ కానిస్టేబుల్‌ నుంచి పైకెదిగిన వ్యక్తి. చిన్న జీవితం నాది. మా తాత, నాన్న సీఎం అయ్యారు గనక నేనూ అవుతా అని లోకేశ్‌ అనుకున్నప్పుడు.. మా నాన్న సీఎం అయ్యారు గనక నేనూ అవుతా అని జగన్మోహన్‌ రెడ్డి ‌ అనుకున్నప్పుడు ఒక కానిస్టేబుల్‌గా జీవితం ప్రారంభించిన వ్యక్తి కొడుకు ఈ రాష్ట్రానికి ఎందుకు సీఎం కాలేడు. కచ్చితంగా అవుతాడు అని జనసేన అధినేత పవన్‌ వ్యాఖ్యానించారు. సభలో ఆయన ప్రసంగిస్తుండగా అభిమానులు సీఎం.. సీఎం అంటూ నినదించడంతో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.