వేపచెట్టు కింద సేదతీరిన పవన్ కల్యాణ్

వేపచెట్టు కింద సేదతీరిన పవన్ కల్యాణ్

ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఆదివారం కృష్ణా జిల్లా ప్రచారంలో మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి లైట్ హౌస్ వద్ద కాసేపు సేదతీరారు. అక్కడే భోజనం చేశారు. మట్టిగిన్నెలో జొన్న అన్నం, మజ్జిగలో కలుపుకుని పచ్చిమిరపకాయ పచ్చడితో నంజుకొని తిన్నారు. వేప‌చెట్టు కింద కూర్చొవ‌డానికి తాటాకు చాప‌ల‌ను జనసైనికులు ఏర్పాటు చేశారు. ఆ వాతావ‌ర‌ణం ఎంతో ఆహ్లాదం క‌లిగించ‌డంతో జ‌న‌సేనాని కాసేపు తాటాకు చాప‌ల‌పైనే సేద‌తీరారు.