పవన్ ను కలిసిన టీడీపీ నేతలు...బాబుకు మద్దతు

పవన్ ను కలిసిన టీడీపీ నేతలు...బాబుకు మద్దతు

ఇసుక అంశంపై చంద్రబాబు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలియజేయాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను కోరారు టీడీపీ నేతలు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ నేత వర్ల రామయ్యలు ఇవాళ  పవన్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.  ఈ సందర్భంగా జనసేనానితో అన్ని విషయాలు చర్చించినట్లు తెలిపారు టీడీపీ నాయకులు. అలాగే చంద్రబాబు దీక్షకు జనసేన తరఫున మద్దతు ఇస్తామని పవన్‌ చెప్పినట్లు వారు వెల్లడించారు.  ఇసుక, కార్మికుల ఆత్మహత్యలపై అన్ని పార్టీలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు తెలుగుదేశం నాయకులు.  జగన్‌ పాలన వల్ల రాష్టం పరువు రోడ్డున పడిందని విమర్శించారు అచ్చెన్నాయుడు. ఏపీలో ఇసుక కొరత కారణంగా ఇప్పటివరకు 45 మంది ఆత్మహత్య చేసుకున్నారని వర్ల రామయ్య అన్నారు. ప్రభుత్వ తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇసుక కొరత కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందజేసిందని, ఆ విధానాన్నే జగన్ ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. తమ దీక్షకు మద్దతు తెలిపిన పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు.