సీఎం గారు.. మీ జిల్లా వాళ్లు ఏం పాపం చేశారు..

సీఎం గారు.. మీ జిల్లా వాళ్లు ఏం పాపం చేశారు..

రెండు రోజులుగా తిరుమల గిరుల్లో పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపిన జనసేన అధినేత ఇవాళ రాజకీయవేత్తగా మారిపోయారు.. శ్రీకాళహస్తిలోని దేవాలయాలను దర్శించుకున్న అనంతరం పవన్ అక్కడి నుంచి చిత్తూరులోని హైరోడ్ వెల్ఫేర్ అప్షన్ బాధితులతో ముచ్చటించి.. వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. సీఎంపై విమర్శలు చేశారు.. చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోని ప్రజలకు న్యాయం చేయలేదని.. ఇక మిగిలిన జిల్లాల ప్రజలకు ఏం న్యాయం చేస్తారని నిలదీశారు.. ఎట్టిపరిస్థితుల్లోనూ.. భూనిర్వాసితులకు న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎన్ఆర్ఐలకు వేలాది ఎకరాలు కట్టబెడుతూ.. విజయనగరం, నంద్యాలలో ఇచ్చిన నష్టపరిహారం చిత్తూరులో ఎందుకు ఇవ్వడం లేదని పవన్ ప్రశ్నించారు..