టీడీపీపై మళ్లీ పవన్‌ ఫైర్‌..

టీడీపీపై మళ్లీ పవన్‌ ఫైర్‌..

ప్రత్యేక హోదా కోసం పోరాటం ఆపేది లేదంటున్న టీడీపీ నేతలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా కోసం తిరుపతి, కాకినాడలో జనసేన గళం విప్పినప్పుడు ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీయే మేలని టీడీపీ నేతలు వాదించారని అన్నారు. ఇందుకు సంబంధించి ఆ సమయంలో దినపత్రికల్లో వచ్చిన క్లిప్లింగ్స్‌ను జత చేస్తూ ట్వీట్‌ చేశారు. రాష్ట్ర విభజన విషయంలో, అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీ ద్వంద్వ వైఖరి.. ఏపీ ప్రజలను గందరగోళానికి గురిచేసిందని అన్నారు.