పవన్ 26 మొదలైంది - 27 ఫిక్స్ అయ్యింది... 

పవన్ 26 మొదలైంది - 27 ఫిక్స్ అయ్యింది... 

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇటీవలే మొదలైంది.  పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.  నిన్నటి నుంచే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. షూటింగ్ ఫస్ట్ డే రోజున పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు.  అజ్ఞాతవాసి తరువాత సినిమా రంగం నుంచి పక్కకు వచ్చి రాజకీయాల్లో బిజీ అయ్యారు. రాజకీయాల్లో ఉంటానని చెప్పడంతో ఇకపై సినిమాలు చేయడమో అనుకున్నారు.  కానీ, పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సినిమాలు చేసేందుకు సిద్ధం అయ్యారు.  

ఇందులో భాగంగానే పింక్ సినిమా చేస్తున్నారు.  దీని తరువాత నిర్మాత ఏ ఎం రత్నంతో సినిమా చేయాల్సి ఉన్నది.  పవన్ కళ్యాణ్ కోసమే అయన ఎదురుచూస్తున్నారు.  క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. అయితే, ఈ మూవీ ఓపెనింగ్ డేట్ ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది.  ఈనెల 27 వ తేదీన సినిమా ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం.  ఇది అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉన్నది.