ఏపీ రాజధాని...పవన్ గాలి తీసేస్తోన్న జీవీఎల్ ?

ఏపీ రాజధాని...పవన్ గాలి తీసేస్తోన్న జీవీఎల్ ?

రాజధాని వ్యవహారం కాకరేపుతూనే ఉంది దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి నుంచి రాజధాని కదిలేది లేదన్న ఆయన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ముట్డడిలో గాయపడ్డ అమరావతి గ్రామాల రైతులను జనసేనాని పరామర్శించారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన రైతులతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ ప్రభుత్వాన్ని కూల్చేవరకు తాను నిద్రపోనన్నారు. మహిళలు అని చూడకుండా పోలీసులు లాఠీఛార్జ్ చేయడం వైసీపీ నేతల అధికార మదమేనని మండిపడ్డారు. తనకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది.. ఢిల్లీకి వెళ్తున్న... నేను మీకు చెప్పడం లేదు.. కానీ, అద్భుతాలు జరగబోతున్నాయన్నారు. అయితే మరో పక్క బీజేపీ రాజ్యసభ్యుడు జీవీఎల్ నరసింహారావు మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అసలు రాజధాని అంశంలో కేంద్ర ప్రభుత్వ జోక్యమేమీ ఉండదని పవన్ గాలి తీసేశారు. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం. కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఇందులో ఉండదని ఆయన అన్నారు. నిజానికి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాష్ట్ర బీజేపీ నాయకత్వం, జనసేన పార్టీ కూడా తీర్మానించాయి. అయితే రాజధాని అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని జీవీఎల్ చెబుతుండగా.. శాశ్వత రాజధానిగా అమరావతే కొనసాగుతుందని పవన్ బలంగా చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది.