జనసైనికులపైనే పవన్ సెటైర్... 

జనసైనికులపైనే పవన్ సెటైర్... 

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు.  ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ మండపేటలోని రైతుల సమస్యలు గురించి తెలుసుకున్నారు.  రైతులు తమ సమస్యల గురించి చెప్పుకునే సమయంలో జనసేన కార్యకర్తలు పెద్ద పెద్దగా నినాదాలు చేయడంతో పవన్ కళ్యాణ్ పవన్ కోపగించుకున్నారు.  ఇలా పెద్ద ఎత్తున గొడవ చేస్తే రైతులు తమ సమస్యలు ఎలా చెప్పుకుంటారని మండిపడ్డారు. 

కార్యకర్తలు క్రమశిక్షణగా ఉండాలని, క్రమశిక్షణగా లేకపోబట్టే గత ఎన్నికల్లో మనం ఓడిపోయామని, జనసేన కార్యకర్తలు క్రమశిక్షణతో ఉంటె తప్పకుండా మనం విజయం సాధించేవాళ్లమని అన్నారు.  పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడేశారు కార్యకర్తలు సైలెంట్ అయ్యారు.  కార్యకర్తలు క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు.