దండం పెడుతున్నా.. కేసీఆర్ మమ్మల్ని వదిలేయండి..!

దండం పెడుతున్నా.. కేసీఆర్ మమ్మల్ని వదిలేయండి..!

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా... మీ గొడవలు ఉంటే రాష్ట్రాన్ని బలిచేయకండి అని విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాజమండ్రిలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ... ఇప్పటికే దెబ్బతిని ఉన్నాం... దొడ్డి దారిన వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు.. కేసీఆర్ గారు రెండు చేతులు జోడించి మీకు రాజమండ్రి సభా వేదికగా విన్నవించుకుంటున్న అన్నారు పవన్ కల్యాణ్. దయచేసి అందరం బాగుందాం... మీరు అద్భుతమైన నేత.. కానీ, గొడవలు పెట్టొద్దు. దశాబ్ధాలుగా మీచేత తిట్లుతున్నాం.. చేతిలెత్తి దండం పెడుతున్నా... దయచేసి ఆంధ్రులను వదిలేయాలని విజ్ఞప్తి చేశారు పవన్ కల్యాణ్.