పవన్ కీలక నిర్ణయం.. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జ్‌ల నియామకం..

పవన్ కీలక నిర్ణయం.. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జ్‌ల నియామకం..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు... ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాలు పెంచేందుకు, పార్టీ బలోపేతంపై దృష్టి సారించేందుకు కమిటీని నియమించారు. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు ఐదుగురు సభ్యులతో సమన్వయ కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు పవన్ కల్యాణ్. ఈ సమన్వయ కమిటీలో టి. శివశంకర్, మేడా గురుదత్, సుజాత పండగా, బొమ్మిడి నాయకర్, వై శ్రీనివాస్ సభ్యులుగా... శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రూరల్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలకు ఈ కమిటీ సమన్వయం చేయనుంది. ఇక, రాష్ట్రంలోని పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇంఛార్జ్‌లను నియమించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌. గత ఎన్నికల్లో పోటీచేసిన వారిలో కొందరిని ఇంచార్జ్‌లు కొనసాగించారు... విశాఖపట్నం జిల్లా, తూర్పు గోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని నియోజకవర్గాలకు ఎవరిని ఇంచార్జ్‌లుగా నియమించారో కింది లిస్ట్‌లో చూసుకోవచ్చు.