సాయి ధరమ్ తేజ్ నటనకు పవన్ ఫిదా

సాయి ధరమ్ తేజ్ నటనకు పవన్ ఫిదా

చిత్రలహరి సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  ఈ సినిమాను చూసిన మెగాస్టార్, తేజ్ నటనను మెచ్చుకున్న సంగతి తెలిసిందే.  ఈ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ కూడా చేరిపోయారు.  ఎన్నికల హడావుడి ముగిసిన తరువాత పవన్ కళ్యాణ్ మంగళవారం రోజున హైదరాబాద్ వచ్చారు.  కాసేపు కుటుంబసభ్యులతో గడిపిన తరువాత పవన్ కళ్యాణ్ చిత్రలహరి సినిమా చూశారు.  

అనంతరం యూనిట్ కు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలుపుతూ పూల బొకేలను పంపాడు.  సినిమా బాగుంది.  మీ వర్క్ ను బాగా ఎంజాయ్ చేశాను అని చిన్న సందేశాన్ని బొకేపై రాశారు పవన్.  పవన్ ఇచ్చిన మెసేజ్ సినిమాకు మరింత మైలేజ్ ఇస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.