వైసీపీ అభ్యర్థులపై పవన్ ఘాటు వ్యాఖ్యలు..

వైసీపీ అభ్యర్థులపై పవన్ ఘాటు వ్యాఖ్యలు..

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరులో నిర్వహించిన బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ఎమ్మెల్యే అభ్యర్థులా? లేక బెట్టింగ్ రాయుళ్లా? అని ప్రశ్నించిన పవన్ కల్యాణ్... జెండా ఏ వైపు తిరగనుంది? అనే విషయంపై కూడా బెట్టింగులు నిర్వహిస్తారని విమర్శించారు. మీకెందుకు ఎమ్మెల్యే అభ్యర్థుల సీట్లు? క్లబ్ లో కూర్చొని పేకాట ఆడుకోండి అని సలహాఇచ్చిన జనసేనాని... పోలీసులను బెదిరించేవాళ్లకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీట్లు ఇస్తారా? అంటూ ఎద్దేవా చేశారు.