మెగాస్టార్ సెట్లో పవర్ స్టార్.. ఫోటో వైరల్

మెగాస్టార్ సెట్లో పవర్ స్టార్.. ఫోటో వైరల్

కొన్ని దృశ్యాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి.  అలాంటి అరుదైన దృశ్యాలను ఫోటో రూపంలో బంధిస్తే.. అవి అమూల్యమైన వస్తువులుగా మారుతుంటాయి.  అలాంటి అతి విలువైన వాటిల్లో ఈ ఫోటోను కూడా చేర్చవచ్చు.  ఒక హీరో షూటింగ్ స్పాట్ లో మరో హీరో సందడి చేస్తుంటారు.  ఇది ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నది.  హీరోల మధ్య పోటీ ఉన్నప్పటికి అందరిమద్య సహృద్భావ వాతావరణాన్ని కల్పించేందుకు ఇలా చేస్తున్నారు.  గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సెట్లో మెగాస్టార్ సడెన్ గా ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు.  ఇది గతం.  

ఇప్పుడు మెగాస్టార్ హీరోగా సైరా అనే చారిత్రాత్మక సినిమా తెరకెక్కుతున్నది.  రామ్ చరణ్ నిర్మాత.  ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్  అమితాబ్ బచ్చన్ ఓ ప్రముఖ పాత్రలో నటిస్తున్నాడు.  కాగా ఈ సినిమా సెట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు.  ఇది జరిగి చాలా రోజులైంది.  పవన్ కళ్యాణ్ సెట్ కు వచ్చినపుడు అక్కడే ఉన్న అమితాబ్, మెగాస్టార్, రామ్ చరణ్ తో కలిసి ఫోటో దిగాడు.  సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఈ ఫోటో వైరల్ గా మారింది.