ఎన్టీఆర్ బొమ్మ తీసి గెలవండి చూద్దాం..

ఎన్టీఆర్ బొమ్మ తీసి గెలవండి చూద్దాం..

జనపోరాట యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇవాళ కార్యకర్తలతో భేటీ అయ్యారు.. ఇచ్ఛాపురం నుంచి పోటీ చేయమని నన్ను చాలామంది కోరారు.. ఆడపిల్లను దీపం.. వెలుగుతో పోల్చే సంస్కృతి శ్రీకాకుళానిదని.. 19 జీవనదులు ఈ జిల్లాలో ప్రవహిస్తున్నాయన్నారు. ఉత్తరాంధ్రను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని.. ఇందువల్ల రాష్ట్రం రాయలసీమ, ఆంధ్ర, కళింగ ఆంధ్రగా మూడు ముక్కలు అవుతుందని పవన్ అన్నారు.. కాలుష్యం వెదజల్లే ప్రాజెక్టులను ఇక్కడికీ తీసుకువస్తున్నారని.. అభివృద్ధి మాటున మానవులను.. ప్రకృతిని ధ్వంసం చేయవద్దని పవన్ హితవు పలికారు.

తెలుగుదేశం పాలన గురించి స్పందిస్తూ.. అన్నీ చేశాము అని టీడీపీ సర్కార్ చెబుతుంటే.. జనం సమస్యలు ఎందుకు తీరడం లేదని జనసేనాని ప్రశ్నించారు.. నేను ఎవరో తెలియదని అశోక్ గజపతిరాజు అంటున్నారు.. నేను సామాన్యుడినని.. నాకు పెద్దలంటే గౌరవమని.. నా ఆత్మగౌరవం దెబ్బ తింటే.. నా తిరుగుబాటు చూడాల్సి వస్తుందని పరోక్షంగా తెలుగుదేశం పార్టీని హెచ్చరించారు. నాడు నా మద్ధతు కోసం వాళ్లే వచ్చారని.. నేడు పవన్ ఎఫెక్ట్ ఒక్కశాతం కూడా లేదని అంటున్నారని.. మరి అలాంటప్పుడు ఎందుకు భయపడుతున్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టలేదని...? మామ పెట్టిన పార్టీలో దొడ్డి దారిన వచ్చి కూర్చొన్నాడని.. ఆ బాధతోనే ఎన్టీఆర్ చనిపోయారన్నారు.. 2019లో ఎవరి మద్ధతు లేకుండా తెలుగుదేశం పోటీ చేయగలదా.. అసలు ఎన్టీఆర్ బొమ్మ లేకుండా గెలవగలరా అంటూ పవన్ సవాల్ విసిరారు.