జనసేన బలోపేతంపై పవన్ దృష్టి.. 

జనసేన బలోపేతంపై పవన్ దృష్టి.. 

హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  ఈ సమావేశానికి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటుగా,  సభ్యులు తోట చంద్రశేఖర్, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ , కందుల దుర్గేష్ ,కోన తాతారావు, ముత్తా శశిధర్, శ్రీమతి పాలవలస యశస్విని, డా.పసుపులేటి హరిప్రసాద్,  మనుక్రాంత్ రెడ్డి, ఎ.భరత్ భూషణ్, బి.నాయకర్ లు హాజరయ్యారు.  రెండు రాష్ట్రాల్లో పార్టీ చేపట్టాల్సిన చర్యలు, ప్రజాసమస్యలపై చేయాల్సిన పోరాటం, ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావడంపై సమావేశంలో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.  

అలానే పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనితీరు, హామీల అమలు, పధకాల అమలులో వైఫల్యాలు వంటి వాటిపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.  అలానే తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.