హరికృష్ణగారి మరణం దురదృష్టకరం - పవన్ కళ్యాణ్

హరికృష్ణగారి మరణం దురదృష్టకరం - పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నందమూరి హరికృష్ణ నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు.  ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన పవన్ ఈరోజు ఉదయం జరిగిన సంఘటన చాలా భాధను కలిగించిందన్నారు. 

ఆయనతో తన పరిచయం తక్కువే అయినా రాష్ట్ర విభజన సమయంలో ఆయన పదవికి రాజీనామా చేయడం నాకు ఎప్పటికీ గుర్తిండిపోయే సంఘటన.  ఆయన మరణం చాలా దురదృష్టకరం.  ఆయనకు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.