పవన్ కూతురు చరణ్ ను డైరెక్ట్ చేస్తుందట.. 

పవన్ కూతురు చరణ్ ను డైరెక్ట్ చేస్తుందట.. 

మెగా కుటుంబం మధ్య ఎలాంటి అనుబంధాలు ఉంటాయో చెప్పక్కర్లేదు. వారి మధ్య అన్యోన్యత ఉంటుంది.  ప్రతి ఒక్కరు కలిసి మెలిసి ఉంటారు.  పండుగలు, వేడుకలకు మెగా ఫ్యామిలీ అంతా కలుస్తుంటారు.  మెగా తమ్ముళ్ల పిల్లలైనా అకిరా, అధ్య, నాగబాబు పిల్లలు, మెగాస్టార్ కూతురులు వారి పిల్లలు అంతా మెగాస్టార్ ఇంట్లో కలుసుకుంటూ ఉంటారు.  

ఇక మెగాస్టార్ ఇంట్లో ఓ బ్లాక్ బోర్డు ఉంటుంది.  ఇంటికి వచ్చి వెళ్లే ముందు వారి నచ్చిన పని ఏం చేయబోతున్నారు.. ఏం చేయాలని అనుకుంటున్నారు అనే విషయాలను అక్కడ ఉన్న బ్లాక్ బోర్డు పై రాసి వెళ్ళాలి.  అయితే, పవన్ కళ్యాణ్ కూతురు ఆధ్య అన్నయ్య చరణ్ ఇంటికి వెళ్ళినపుడు తన మనసులోని మాటను రాసిపెట్టింది.  అదేమంటే అన్నయ్య చరణ్ సినిమాకు దర్శకత్వం వహించాలని అనుకున్నారు రాసిపెట్టిందట.  ఈ విషయం చూసి చరణ్ షాక్ అయ్యాడు.  చిట్టి చెల్లెలు ఆద్య కోరిక తప్పకుండా నెరవేరాలని చరణ్ కోరుకుంటున్నాడట.