ఢిల్లీ వెళ్ళిన పవన్...మోడీషాలతో భేటీ !

ఢిల్లీ వెళ్ళిన పవన్...మోడీషాలతో భేటీ !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ హఠాత్తుగా ఢిల్లీ బయలుదేరారు. ఆయన కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే ప్రధాని మోదీ, అమిత్ షాలను కలుస్తానని గతంలోనే ప్రకటించిన నేపధ్యంలో పవన్ ఢల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్న పవన్ కల్యాణ్ జగన్ నుండి ఆ పార్టీ నుండి వ్యక్తిగత విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఉదయం మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాన్ని జనసేనాని ప్రారంభించి.. భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన కూలీల ఆత్మహత్యలను కేంద్రం దృష్టికి ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.