చంద్రబాబు, జగన్ ఫ్యామిలీ గుప్పెట్లో ఏపీ...

చంద్రబాబు, జగన్ ఫ్యామిలీ గుప్పెట్లో ఏపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు, వైఎస్ జగన్ కుటుంబాలు తమ గుప్పెట్లో పెట్టుకున్నాయని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్...  పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జనసేనాని... భీమవరంలో మాట్లాడుతూ... మనమంతా మనుషులుగా ఉన్న కులాలుగా విడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్లు పెట్టి బీసీలకు అన్యాయం జరుగుతుందనేది మీరే... సమాజాన్ని అన్ని రకాలుగా విభజించి పాలిస్తున్నారని... కాపు రిజర్వేషన్లు చేయాలంటే బీసీ కులాలను కూర్చొపెట్టి లాభనష్టాలు వివరించాలని సూచించారు.

ప్రజలకు అందుబాటులో ఉండే వాడే నాయకుడు కావాలి... మీ పిల్లల భవిష్యత్తు బావుంటుంది... పవన్ కల్యాణ్ మీద నమ్మకం ఉంటే జనసేనకు ఓటేయాలని పిలుపునిచ్చారు జనసేనాని... మోసపోతున్నామని తెలిసి ఎందుకు ఓట్లు వేయాలని అని ప్రశ్నించిన పవన్... ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రజల భాద్యత... జనసేన ప్రశ్నించడానికే పరిమితం కాదన్నారు. దశాబ్దాలుగా దెబ్బతింటున్నామంటే మనలోని అనైక్యతే కారణమన్న జనసేన అధినేత... కులాల ఐక్యత అనేది ఒక ఆశయం అన్నారు. ఇక నియోజకవర్గ స్థాయిలో సమస్యలు చాలా బలంగా ఉన్నాయని... భీమవరంలో డంపింగ్ యార్డు లేకపోవడం ప్రధాన సమస్య అన్నారు పవన్.